పిల్లలను హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదు..
1 min read

2018లో పిల్లల్ని చంపిన కేసులో శిక్ష..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఇద్దరి పిల్లల్ని చంపిన కేసులోఓ తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష మరియు 2 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు 7వ జిల్లా న్యాయాధికారి తీర్పు చెప్పారు.జూపాడు బంగ్లా ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన ధనోజి రావు(32) భార్యపై అనుమానం పెంచుకొని ధనోజీ రావు భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయిందని 08.10.2018 న తెల్లవారుజామున భార్యపై అనుమానంతో తన కూతురు నిఖిత(7),మధు చరణ్(4)లను తన ఇంటికి దగ్గరలో నీటి కుంటలో ముంచి తండ్రి పిల్లలను చంపాడు. ప్రకాశం జిల్లా కనకల మెట్ల మండలానికి ముద్దాయి అత్త అంజమ్మ ఫిర్యాదు మేరకు అప్పట్లో ధనోజీ రావుపై జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై అశోక్ కేసు నమోదు చేశారు.దర్యాప్తు అదికారులు కోర్టు నందు చార్జీ షీట్ దాఖలు చేయగా ప్రస్తుత జూపాడుబంగ్లా ఎస్ఐ మల్లికార్జున పర్యవేక్షంలో సాక్షులను కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో ముద్దాయి సిందే ధనోజీ రావుకు జీవిత ఖైదు శిక్షతో పాటు 2 వేలను కోర్టు జరిమానా విధించడంతో నిందితుడిని జైలుకు తరలించారు.

