ఉత్సాహంగా 58వ,జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
1 min read

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు
పలువురికి సన్మానాలు,విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోలు అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం “58 వ” జాతీయ గ్రంథాలయ వారోత్సవాలుచాలా ఉత్సాహంగా కొనసాగుతున్నాయని జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి ఎమ్. శేఖర్ బాబు తెలిపారు. ఏలూరు లోఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులకు ఉదయo వ్యాసరచన, వకృత్వం పోటీలునిర్వహించామన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ యం.పద్మజ పాల్గొని గ్రంథాలయ వారోత్సవాలను పర్యవేక్షించారు. గ్రంథాలయ భవనం స్థితిగతులను, సిబ్బంది కొరతను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో గల అన్నీ విభాగాలను పరిశీలించారు. పాఠకులకుఏమైనాపుస్తకాలు అవసరమైతే అధికారులను కలిసి తమయొక్క ఇబ్బందులను తెలియజేయాలని ఆయన సూచించారు. వారోత్సవాలలో పాల్గొన్న చిన్నారులను చూసి హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే మనం విజయానికి చేరుకుంటామని, విద్యార్థులకు కొన్నివిలువైనప్రశ్నలనుఅడిగారు. ప్రతి ఆదివారం నిర్వహించే చదవటంమాకిష్టంకార్యక్రమంగురించిఅడిగారు.మంచి విజ్ఞానం తోకూడినసూచనలను తెలిపారు. చివరగా కందుకూరి వీరేశలింగంగారుచెప్పినట్టు చిరిగిన చొక్కా అయిన తొడుక్కోకానీ,ఒకమంచి పుస్తకంకొనుక్కోఅనిఅన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ వారిని కార్యదర్శి పూల మొక్కతో మరియు మెమెంటో మరియు శాలువాలతో ఘనంగా సన్మానించారు. మరియు మాజీ ఎంఎల్ సి రాముసూర్యారావు( ఆర్ ఎస్ ఆర్) మాస్టారు పాల్గొని విద్యార్థులకు మంచి సూచనలు తెలిపారు. అనంతరం కార్యదర్శి మాజీ ఎఎల్ సి వారిని సన్మానించారు. తదుపరికార్యక్రమం మధ్యాహ్నo వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం మరియు జనరల్ నాలెడ్జ్ పై క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి వై. ఆనందనాయుడు, ఎమ్.రాధారాణి, కె.మాణిక్యాలరావు,ఎమ్.నరేంద్ర, ఎం.వెంకట్,వి.శిరీష,డి.శేఖర్ బాబు,ఆర్. భాస్కర్ సాయికుమార్,కె అనురాధ, కుమారి ప్రజ్ఞ తేజస్వి,పాల్గొని నిర్వాహకులుగావ్యవహరించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఎల్.వెంకటేశ్వరరావు, కార్యాలయంసిబ్బంది,జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది పాఠకులు, తదితరులు, పాల్గొన్నారు.

