చింతలపూడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
1 min read

పరిష్కార వేదిక ద్వారా ప్రతి శుక్రవారం అర్జీల స్వీకరణ కార్యక్రమం
పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు.చింతలపూడి (ఆర్ అండ్ బి) గెస్ట్ హౌస్ సమావేశ హాలు నందు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ శాఖల మండల అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ మండల ఎంపీడీవో తాసిల్దార్ మండల అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

