పిల్లలు అన్ లైన్ భద్రత పై అవగాహన సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా(CIF) సౌజన్యముతో జిల్లా న్యాయ సేవా సదన్ కర్నూలు నందు ఏర్పాటు చేసిన పిల్లల ఆన్లైన్ భద్రతా విధానాలు సైబర్ క్రైమ్స్ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి. జడ్జి మాట్లాడతూ సమాజంలో ఆన్ లైన్ లలో పిల్లలపై అనేక రకాలుగా లైంగిక దోపిడీ లు జరుచున్నాయని తెలిపారు. వాటిని ఎలా ఎదుర్కొని పిల్లలను రక్షించాలన్నది ఈ సదస్సులో వివరిస్తారని తెలిపారు. కర్నూలు సైబర్ క్రైమ్ సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆన్లైన్లో జరిగే మోసాల ను గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని వివరించారు. బెంగళూరు నుంచి వచ్చిన శుభ్రత్ కుమార్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ పిల్లలపై ఆన్లైన్ లో జరిగే లైంగిక దోపిడీని ఎలా ఎదుర్కోవాలో చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ వారికి, జూవేనేల్ జస్టిస్ బోర్డు మెంబర్స్ కి, చిల్డ్రన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్లకు, ఎంఈఓ లకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాశ్వతంలో లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాధ్, కర్నూలు న్యాయ వాదుల సంఘము అధ్యక్షుడు హరినాధ్ చౌదరి, కోఆర్డినేటర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ కే. వి. కొండప్ప, కర్నూలు, నంద్యాల, కోడుమూరు ఐసిడిఎస్ సిడిపిఓలు కర్నూలు, నంద్యాల ఐసిడిఎస్ డీసీపీఓలు, పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ బాయ్స్ అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుస్సేన్ భాష, డిపిఓ దివాకర్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం, సిడబ్ల్యుసి చైర్మన్ జుబేదా బేగం,కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్, దిశ సిఐ రామా నాయుడు, బచ్పన్ బచావో చిల్డ్రన్స్ ఎన్జీవో మౌనిక,లీగల్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, స్కూల్ హెడ్మాస్టర్లు, మండల విద్యాధికారులు, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గోన్నారు.

