NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయస్థాయి డ్రాగన్ బోట్ పోటీలకు ఏపీ క్రీడాకారులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఈనెల 24 నుంచి 27 వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ లో జరగబోయే 12వ జాతీయ స్థాయి సీనియర్ డ్రాగన్ బోట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు శనివారం కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి పయనమయ్యారు.ఈ  సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి లు హాజరై మాట్లాడారు.జాతీయ స్థాయిలో సత్తా చాటి రాష్ట్ర జట్టు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఏపీ జట్టు మిక్స్డ్ విభాగంలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.

జట్టు వివరాలు..టీ.ధోని,రాయ లిఖిత చౌదరి,కే మోహిత్ రావ్, డి. ఆసిఫా నాజ్ (అంతఃపురం), కమ్మరి శేఖర్, చెంచు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ (కర్నూలు), హరిజన రామచంద్రుడు (నంద్యాల),ఎన్ శివాజీ, పి మోహన లక్ష్మీ ప్రియాంక (ప్రకాశం).

About Author