మహానంది ఆలయానికి భద్రత పెంపు..
1 min read

మహానంది, న్యూస్ నేడు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయానికి భద్రత పెంచనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గతంలో మహానంది ఆలయానికి మూడు షిఫ్టుల్లో దాదాపు 8 నుండి 9 మంది హోంగార్డులు భద్రతా కారణాల దృష్ట్యా విధులు నిర్వహించేవారు. కోవిడ్ నుండి జరిగిన పరిణామాలతో అప్పటినుండి కేవలం ముగ్గురు మాత్రమే 3 షిఫ్టుల్లో విధులు నేటి వరకు నిర్వహిస్తున్నారు. ఈనెల 14న నేడు/ పల్లె వెలుగు దిన పత్రికలో మహానంది ఆలయానికి భద్రత కరువు అనే శీర్షిక సంబంధించి అధికారులు స్పందించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నంద్యాల జిల్లా పోలీస్ బాస్ మహానంది ఆలయ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి క్రింది స్థాయి అధికారులకు భద్రతకు సంబంధించిన మెన్ వివరాలు సేకరించినట్లు తెలుస్తుంది. దీనికి తోడు మహానంది ఆలయ అధికారులు కూడా జిల్లా పోలీస్ బాస్ ను కలిసి అవసరమైన హోంగార్డుల సంఖ్య పెంచాలని కోరినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే త్వరలోనే అవసరమైన సిబ్బందిని ఆలయ రక్షణ కోసం నియమించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆలయ అధికారులు కూడా ఈ విషయంపై త్వరలో హోమ్ గార్డుల సంఖ్య ఆలయ భద్రత దృష్ట్యా పెంచే అవకాశం ఉందని సంకేతాలు వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది కొద్ది రోజుల్లో ఆలయ భద్రతలో భాగంగా భద్రత సిబ్బందిని పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లా పోలీసు బాస్ కూడా ఆలయ భద్రతపై ఉపేక్షించడం సరికాదని త్వరలో భద్రత ఏర్పాట్లకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

