అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి గారి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వారు 25-11-2025 తేదీన కర్నూలు నందలి కెవిఆర్ డిగ్రీ కాలేజీ ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవానికి ముఖ్య అతిథులుగా కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబెర్ రూఖయ్య బేగం హాజరయ్యారు. ఈ సదస్సులో జడ్జి మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని గృహహింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని వీటన్నిటిని అరికట్టే ప్రయత్నంలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం నవంబర్ 25న స్త్రీల హక్కుల పరిరక్షణ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం జరపాలని తీర్మానించిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులు హింసపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వారు దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.వారికి ఎవరికైనా న్యాయపరమైన సమస్యలు వస్తే 15100 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబెర్ రూఖయ్య బేగం మాట్లడుతూ జాతీయ మహిళా కమిషన్ వారు మహిళల రక్షణ కోరకు ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 14490 కాల్ చేస్తే సంబంధిత డిపార్ట్మెంట్ వారు వారికి తగిన సహాయాన్ని అందిస్తారని తెలిపారు. సిఐ విజయలక్ష్మి మాట్టాడుతూ సైబర్ చట్టాలు మరియు క్రిమినల్ చట్టాల గురించి వివరించారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది సులోచన ఉచిత న్యాయ సేవలు, న్యాయ సేవ అధికార సంస్థ నుంచి ఎలా పొందాలో వివరించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. వి. వెంకట రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రంగారెడ్డి,మహిళా సాధికారకత సెల్ అధ్యాపకులు డాక్టర్ పద్మావతి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


