NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల ముఖాల్లో అసలైన చిరునవ్వులు చూడడమే కూటమి ప్రభుత్వ అభిమతం 

1 min read

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి  ఘన స్వాగతం పలికిన

వ్యవసాయ అధికారులు,రైతులు గ్రామ ప్రజలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:రైతుల ముఖాల్లో అసలైన చిరునవ్వులు చూడడమే కూటమి ప్రభుత్వ అభిమతమని ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆ దిశగా వారిలో నూతనోత్తేజం నింపేందుకు కృషిచేస్తున్నామని వారు వెల్లడించారు. రైతన్న మీకోసం కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. స్థానిక చొదిమెళ్ళలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌ కుమార్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం చొదిమెళ్ళలోని రైతుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎంపి, ఎమ్మెల్యేలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించారు. ఇదేసమయంలో అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్‌ పథకంలో లబ్దిపొందిన అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న మీకోసం పేరుతో పంపిన అభినందన లేఖలను అందజేశారు. అక్కడున్న రైతు సేవా కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే చంటి.ధాన్యం సేకరణా ప్రక్రియను పరిశీలించారు. స్వయంగా ట్రాక్టర్‌ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎంపి పుట్టా మహేష్‌ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్‌ పథకంలో భాగంగా ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో లక్షా 20వేల మంది రైతులకు లబ్దిచేకూరిందన్నారు. వారి సంతోషంలో భాగస్వాములమైనందుకు ఆనందంగా ఉందన్న ఆయన రైతులకు మేలు చేయాలనే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వాధినేతలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఏలూరు అర్భన్‌ తాహశీల్దార్‌ గాయత్రి దేవి, ఏలూరు మండలం  ఏఎంఓ  ఆళ్ల జీవన సంధ్య ,డివిజన్ ఇన్‌ఛార్జ్‌ ఎడ్లపల్లి శివ, శనివారపు పేట సొసైటీ బ్యాంకు చైర్మన్‌ కోనేరు వంశీకృష్ణ , బెజవాడ వెంకన్న, చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About Author