54 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి
1 min read

మహానంది, న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మంది గ్రేడ్ 4 నుండి గ్రేడ్ 3 గా కార్యదర్శులకు పదోన్నతి పొందినట్లు విశ్వాసనీయ సమాచారం. ఇందులో భాగంగా మహానంది మండలం యు. బొల్లవరం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న నాగ కాంత, సీతారామపురం లో పనిచేస్తున్న రేణుక లకు గ్రేడ్ 4 నుండి గ్రేడ్ 3 గా పదోన్నతి పొందినట్లు తెలుస్తుంది. ఇప్పటికే నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి నంద్యాల జిల్లాలో నీ వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈనెల చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో పదోన్నతులు పొందిన వారిని రిలీవ్ చేయాలని సంబంధిత ఆయా మండల అధికారులను కలెక్టర్ జి. రాజకుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పదోన్నతులు పొందిన వారికి కేటాయించిన స్థానాల్లో పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

