మాది ప్రజా ప్రభుత్వం..రైతు ప్రభుత్వం
1 min read

ముగిసిన’రైతన్నా-మీ కోసం:ఎమ్మెల్యే
3,86,225 రూ.ల సీఎంఆర్ఎఫ్ పంపిణీ..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : గత ఏడు కొనసాగుతున్న’రైతన్నా- మీకోసం’కార్యక్రమాలు నిన్న శనివారంతో ముగిశాయి.మా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ ఎన్ రామస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతన్నా-మీకోసం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే హాజరై ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నగదు రెండవ విడత 7వేల రూ.లు రైతుల ఖాతాల్లో జమ కావడంతో ప్రభుత్వం అందిస్తున్న వాటి పథకాల గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. రాబోయే రోజుల్లో గ్రామాలను ఇంకా అభివృద్ధి చేస్తామని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనిరైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు.తర్వాత రోళ్లపాడు,మిడుతూరు, తిమ్మాపురం గ్రామాల్లో ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఐదుగురికి కలిపి 3,86,225 రూ.ల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
లక్ష్మీదేవికి 2,39,305రూ.లు, షేక్ హుసైన్ బాష-20 వేలు,వడ్డే నాగమ్మ-68 వేలు,లింగమయ్య-35 వేలు,వసుందర-23,920 రూ.ల చెక్కులను, వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోవ్యవసాయ శాఖ ఏడిఏ గిరీష్, మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్ వంగాల శివరామి రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,ఎంపీడీవో దశరథ రామయ్య, తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంఏఓ పీరు నాయక్,నాగేంద్ర,వెంకటేశ్వర్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుగుణావతి తదితరులు పాల్గొన్నారు.

