డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’కి 62 వినతులు
1 min read

ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
తిరుపతి, న్యూస్ నేడు : ఎపిఎస్పీడీసీఎల్ నిర్వహించిన ”డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి” కార్యక్రమానికి 62 వినతులు అందినట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి కార్యక్రమం జరిగింది. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం, విద్యుత్ లైన్ మార్పు, కాలిపోయిన/చోరీకి గురైన ట్రాన్స్ ఫార్మర్ల మార్పు, లో-ఓల్టేజ్ సమస్య, ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు, ఇనువ విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలు వీటిలో వున్నాయి. ఈ అంశాలపై వారికి సిఎండి శివశంకర్ లోతేట్ సమాధానమిస్తూ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా గత నెల 24వ తేదీ వరకు వరకు మొత్తం 265 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను తెలియజేశారని, 118 సమస్యలను ఇప్పటికే పరిష్కరించామన్నారు. వాటిలో వినియోగదారుల వైపు నుంచి స్పందించాల్సిన సమస్యలు 44, విద్యుత్ శాఖ వైపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలు 52, పాలసీ మ్యాటర్ కు సంబంధించి 22 సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. సోమవారం అందుకున్న వినతుల్లో కర్నూల్ నుంచి 15, కడప 13, అనంతపురం 11, నెల్లూరు 8, శ్రీసత్యసాయి 5, చిత్తూరు 4, తిరుపతి 2, అన్నమయ్య 2, నంద్యాల నుంచి 2 వినతులు వచ్చాయని తెలియజేశారు. దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ సంబరు: 9133331912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్(ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్డి) కె. గురవయ్య, డైరెక్టర్/ ఫైనాన్స్ (ఎఫ్ఎసి) కె. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పి. హెచ్. జానకి రామ్, జె. రమణా దేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, యం. మురళీకుమార్, యం, ఉమాపతి, పి. సురేంద్ర నాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, రామచంద్ర రావు, చక్రపాణి, సురేంద్ర రావు, భాస్కర్ రెడ్డి. జగదీష్, ప్రసాద్, వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.

