పట్టణ పేద ప్రజలపై కక్ష ఎందుకు.?
1 min read

10 లక్షల నిధులను వెనక్కి పంపడంపై
కమిషనర్ మరియు సిబ్బందిపై మున్సిపాలిటీ చైర్మన్ ఫైర్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: పట్టణంలో ఉన్న పేద ప్రజలపై మీకు కక్చ ఎందుకని నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పై మరియు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపాలిటీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూపట్టణంలో మారుతి నగర్, హాజీనగర్ కాలనీల ప్రజల విజ్ఞప్తి మేరకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 10 లక్షలను మంజూరు చేశారు.కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులను జిల్లా అధికారులు ఆదేశించారు.అయితే ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు తప్పుడు సమాచారం అందిస్తూ ‘స్థలం లేదని’ తెలపడంతో కేటాయించిన 10 లక్షల ఎంపీ నిధులు వెనక్కి వెళ్ళిన ఘటన తీవ్రంగా ఖండనీయమని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అదే విధంగా సంగయ్య పేట, సుబ్బరావు పేట,బైరెడ్డి నగర్, ఎస్ఎస్ఆర్ నగర్ కు సంబంధించి కమ్యూనిటి హాల్ కు స్థలం కేటాయించడంలో మున్సిపల్ కమీషనర్,టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనిప్రజల అవసరాలను పట్టించుకోకుండా సమాజానికి ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని అడ్డుకుంటూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం తీవ్రంగా ఖండనీయమని అన్నారు. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి రాజకీయాలు చూసుకోవాలన్నారు.వచ్చిన నిధులను పట్టణ అభివృద్ధికి వాడుకోవాలి కానీ ఇలా వృధా చేయడం మంచి పద్ధతి కాదన్నారు.మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్ చిన్నపాటి మరమ్మతులు చేయించకుండా అనవసరంగా ప్రైవేట్ ట్రాక్టర్ ను అద్దెకు తీసుకొని ట్రాక్టర్ కు నెలకు 40 వేలకు పైగా చెల్లిస్తున్నారని చైర్మన్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చాంద్ భాష,లాలు ప్రసాద్,సప్లయర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

