NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సైనికుల కుటుంబాలకు, సంక్షేమానికి ప్రజలు ముందుకు రావాలి

1 min read

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు:  జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు చాంబర్లో గురువారం డిసెంబరు 07 సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వాల్ పోస్టరు, స్టిక్కర్లను  ఆవిష్కరించి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సాయుధ దళాలు పతాక నిధికి మొదటి విరాళం అందించారు.ఈ సందర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ భారత సైనికదళాలు దేశభక్తి, సాహసం, త్యాగాలు పట్ల దేశం గర్విస్తున్నదని, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింథూర్ లోను, ప్రకృతి వైపరీత్యాలు సమయంలోను, దేశ సరిహద్దులు మన సైనికులు ధైర్యసాహసాలకు దేశం గర్విస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలు అందించే విరాళాలు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, పశ్చిమ గోదావరి జిల్లా  స్టేటు బ్యాంకు ఆఫ్ ఇండియా అక్కౌంటు నెం.62068471992,  ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN0012722 కు పంపుతూ,  జిల్లా సైనిక సంక్షేమాధికారి మొబైల్ నెం.8688817953 మరియు ఈమెయిల్ zswowgoap@gmail.com పశ్చిమ గోదావరి జిల్లా వారికి తెలియజేయలన్నారు. ఈ విరాళములకు ఆదాయపుపన్ను చట్టము 1961 ద్వారా ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక  సంక్షేమ శాఖ అధికారి ఎస్.కొండలరావు, ఎక్స్ జె.డబ్ల్యు.ఓ డి.వి రామయ్య, ఎ.వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author