NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ జూనియర్ కళాశాల లో తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం తల్లిదండ్రులు మరియు అధ్యాపకుల ఆత్మీయ సమావేశం  ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ సమావేశం మన పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఒక అవకాశం.మన కళాశాల లో విద్యార్థులకు మంచి విద్య, నైతిక విలువలు, సాంఘిక నైపుణ్యాలు అందించడానికి మేము కృషి చేస్తున్నాము. మన పిల్లలు భవిష్యత్తులో మంచి పౌరులుగా, నాయకులుగా ఎదగడానికి మేము సహాయం చేస్తున్నాము. ఈ సమావేశంలో,  మీరు మేము కలసి మన పిల్లల పురోగతి గురించి చర్చిస్తాము, వారి సమస్యలను పరిష్కరిస్తాము, వారి భవిష్యత్తుకు మంచి మార్గదర్శకత్వం  అందిద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధి గా విచ్చేసిన  ప్యాపిలి సీఐ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వయస్సు లో విద్యార్థులు వివిధ రకాల ఆకర్షణలకు లోను అవుతుంటారు ఆ భ్రమల నుండి మన పిల్లలను మనం రక్షించుకోవాలి అందుకే మనపిల్లల పట్ల మనం కొంచం శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. విద్యార్థులు మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాకారానికి  నిరంతరం కృషి చేయాలనీ  విద్యార్థులకు సూచించాడు. అనంతరం అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులతో వారి పిల్లల వివిధ పరీక్షలలో వచ్చిన మార్కులను మరియు వారి కళాశాల హాజరు పనిదినాల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి,ప్యాపిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తొప్పేల శ్రీనివాసులు, రామ్ మోహన్ యాదవ్, మైనారిటీ నాయకులు ఖాజీ పీర్, తెదేపా నాయకులు కొంగనపల్లి మధు, నాగేంద్ర, ప్రిన్సిపాల్ మధు, అనుదీప్, అధ్యాపకులురామకృష్ణయ్య, నవీన పాటి, ఓబులేసు, వెంకటరమణ, మద్దిలేటి, ముస్తాక్, మురళి మోహన్, వెంకటేశ్వర్లు, శంకరయ్య, సురేష్, వన్నూర్, మంజునాథ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author