మహిళా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ఆపస్ వినతి
1 min read
ఒంగోలు, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుటకు సహకరించాలని కోరుతూ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషితా రాజు ని కలసి కోరడమైనది ఇటీవల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎంపికైనందున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆపస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సిహెచ్ హిమజ మహిళా ఉద్యోగుల కు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ విషయంలో త్వరితగతిన ఉత్తర్వులు ఇప్పించాలని సర్వీసులో ఎప్పుడైనా వాడుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లలకే కాకుండా వారి వారసులకు కూడా ఈ సెలవులు వినియోగించుకునేటట్లు ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

