NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాంతిభద్రతల పరిరక్షణకై ప్రత్యేక నిఘా : ఎస్పీ

1 min read

పోలీసుల పనితీరుపై ఎస్పీ ఆరా

గ్రేవ్ ప్రాపర్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ సునీల్ షెరాన్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: శాంతిభద్రతల పరిరక్షణకై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.గురువారం ఉదయం నుండి మిడుతూరు, బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరు పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్లలో కేస్ రికార్డులు,స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధులు,లాకప్ గదులను ఎస్పీ పరిశీలించారు.స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.పెండింగ్ కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి. స్టేషన్ కు వచ్చే వారి సమస్యలను విని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు.పోలీసుల పని తీరుపై ఎస్పీ ఆరా తీశారు.గ్రేవ్ మరియు ప్రాపర్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని స్టేషన్ రికార్డులను సిసిటిఎన్ఎస్ లో రోజువారీగా పూర్తి చేయాలన్నారు.రోడ్డు ప్రమాదాలపై అవగాహన,నేర నియంత్రణ చట్ట వ్యతిరేకమైన అక్రమ రవాణా వంటి వాటిపై నిఘా ఉంచాలని అదేవిధంగా రౌడీషీటర్లపై ప్రత్యేకంగా నిఘాఉంచాలి.విధుల పట్ల సిబ్బందికి ఎస్పీ తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు తిరుపాలు,సురేష్,హెడ్ కానిస్టేబుల్ గోవిందు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author