ప్రకృతి వ్యవసాయానికి క్షేత్రస్థాయిలో రైతు పొలంలో సందర్శన
1 min read

ప్రకృతి వ్యవసాయ డిపిఎం బి. వెంకటేష్
25 రకాలకు పైగా తీగజాతి, దుంప జాతి, సుగంధ ద్రవ్యాలు విభిన్న పంటలు కోయవచ్చు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలోని లతోఅంకన్నగూడెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయానికి చెందిన 150 మంది ఉన్న క్యాడర్ ICRPలతో కలిసి క్షేత్రస్థాయిలో ఆదర్శ రైతు పొలంలో సందర్శించి, ఆయన అమలు చేస్తున్న ఏటీఎం ( ఎనీ టైం మనీ ), ఏ-గ్రేడ్ డ్రాగన్ ఫ్రూట్, అంతర పంటల్లో పువ్వులు మరియు కూరగాయలు మోడల్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫీల్డ్ విజిట్ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ డిపిఎం బి. వెంకటేష్ మాట్లాడుతూ,ఏటీఎం ఏటీఎంమోడల్ ద్వారా 25 రకాలకు పైగా రకాలు తీగజాతి దుంప జాతి సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పంటలు వంటి విభిన్న పంటలను నిరంతరం కోయవచ్చని వివరించారు. ఈ మోడల్ ద్వారా ఇంటి అవసరాలకు ఆరోగ్యకరమైన కూరగాయలు లభించడం మాత్రమే కాకుండా, రోజుకు రూ.350–400 వరకూ అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. అదనంగా, ఏ-గ్రేడ్ డ్రాగన్ ఫ్రూట్, అంతర పంటల్లో బంతి–చామంతి పూల సాగు, అలాగే 6 ఎకరాల్లో 18 రకాల కూరగాయల సాగు కూడా సందర్శించారు. ఈ వ్యవసాయ క్షేత్రం ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగుచేయబడటంతో సంపూర్ణ జీవవైవిధ్యం, పచ్చదనం మరియు తక్కువ వ్యయంతో అధిక దిగుబడి కనిపించింది. క్షేత్ర పర్యటనలో భాగంగా పాల్గొన్న వారికి ప్రకృతి వ్యవసాయంలోని సీడ్ పెలెటైజేషన్, ఘన జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం వంటి కీలక ఇన్పుట్లపై ప్రత్యక్ష ప్రదర్శనలు (లైవ్ డొమాన్ స్టేషన్స్ ) నిర్వహించి, హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని వెంకటేష్ తెలియజేసారు.

