NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవతరగతి యూటీఎఫ్ మోడల్ పేపర్స్ ఉచితంగా పంపిణీ

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు   :  ప్యాపిలి మండలం వెంగళంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సోషల్ సబ్జెక్ట్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన సామ్రాజ్య లక్ష్మీ  రిటైర్ అయినా తన పాఠశాలలోని పిల్లలు అందరూ బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే ఉద్దేశ్యంతో యూటీఎఫ్ ప్రతి సంవత్సరం నిపుణులతో తయారు చేయించిన మోడల్ పేపర్స్ ను ముఖ్యంగా గత సంవత్సరం 60 శాతానికి పైగా ఈ మోడల్ పేపర్స్ నుండి ప్రశ్నలు రావడంతో సామృజ్యలక్ష్మి  యూటీఎఫ్ నాయకులు అబ్దుల్ లతీఫ్  ద్వారా   ఎస్సెసి  మోడల్  పేపర్స్ సేకరించి  వెంగళంపల్లి ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 11 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా గురువారం ఉదయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సునంద  చేతుల మీదుగా  ఇవ్వడం జరిగింది.రిటైర్ అయిన కూడా పాఠశాల పట్ల పాఠశాలలోని పిల్లల పట్ల మేడం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటం పట్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు కి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పురుషోత్తం ,జయలత తదితరులు పాల్గొన్నారు.

About Author