NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కళాశాలలో టీటీసీ విద్యార్థిని ఆత్మహత్య..

1 min read

విద్యార్థి చింతలపల్లె వాసి..

మిడుతూరు, న్యూస్​ నేడు  : టీటీ సీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లె గ్రామానికి చెందిన బోయ చంద్రకళ (17) ఆత్మహత్య చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు నారాయణ,నాగేశ్వరమ్మ కూతురు చంద్రకళ కర్నూలు డైట్ ప్రభుత్వ కళాశాలలో టిటిసి చదువుతుందని అక్కడే హాస్టల్లో ఉంటుందని కళాశాలలో గదిలో ఉన్న కిటికీ కి చున్నీతో గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. తల్లిదండ్రులకు ముగ్గురు కూతుర్లు కాగా చంద్రకళ మూడవ కుమార్తె 10 రోజుల క్రితం ఇంటి నుండి కళాశాలకు వెళ్లిందని వారు తెలిపారు. విద్యార్థిని చనిపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

About Author