NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారులన్నీ నూతనీకరిస్తున్నాం :  ఎమ్మెల్యే  బోడే ప్రసాద్

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు :   కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూట్ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో వివిధశాఖల మంత్రివర్యుల సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు రైతులకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించామని రోడ్లన్నీ ఆధునీకరిస్తున్నామని పత్రికసమావేశంలో తెలిపిన ఎమ్మెల్యే  బోడే ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ల ద్వారా త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు., కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు పూర్తయ్యేలోపలే అధ్వాన్నంగా ఉన్న రోడ్లన్నీ నూతనీకరిస్తామన్న ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా ప్రజలకు అర్ధమయ్యి మేము గ్రామాలలో పర్యటిస్తుంటే ప్రజలుచూపే అభిమానాన్ని బట్టి ఋజువు చేస్తున్నారనీ, భవిష్యత్తు నాయకుడు  నారా లోకేష్ బాబు  దేశ భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు సాధించేలా ప్రణాళికలు రూపొందించి, సాకారం దిశగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ మార్పుడి ధన కోటేశ్వరావు సాగేoపు అంగిరేకుల మురళి దోనేపూడి రమ దేవి షేక్ హిమం  ఇటూరి నాగేశ్వరావు తుమ్మల రాంకుమార్ సిరిగిరి మధు మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author