నూతన డి ఈ ఓ రేణుక ను కలసిన ఆపస్ ప్రతినిధులు
1 min read
ఒంగోలు, న్యూస్ నేడు : విద్యాశాఖాధికారి వారి కార్యాలయం లో నూతముగా జిల్లా విద్యాశాఖాధికారిగా జాయిన్ అయిన శ్రీమతి సి.వి. రేణుకా మేడం ని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకం గా కలసి విద్యావిషయక అంశాలను, 10 వ తరగతి యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు. డీఈ ఓ ను కలిసినవారిలో రాష్ట్ర సంఘటనా కార్యదర్శి సి హెచ్ . శ్రావణ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్. హిమజ, జిల్లా అధ్యక్షులు కమ్మ మల్లికార్జునరావు, జిల్లా బాధ్యులు బి.గుణప్రసాద్ , కె వి శేషారావు, వి . చంద్రశేఖర్, పి. రవిశంకర్, రామశర్మ తదితరులు పాల్గొన్నారు.

