NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదు !           

1 min read

విజేతలను అభినందించిన హెచ్ఎం కాటo శ్రీదేవి

పత్తికొండ, న్యూస్​ నేడు:  విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏమీ లేదని పత్తికొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాటన్ శ్రీదేవి తెలిపారు.  కర్నూల్ పట్టణంలో ఇటీవల జరిగిన “కర్నూలు బాలోత్సవం” పోటీలలో పాల్గొని   పత్తికొండ జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పరవస్తు చందు శ్రీ  ఏకపాత్రాభినయం చేసి విజేతగా నిలిచినందుకు, అలాగే భరతనాట్యం చేసి  అక్కడ అద్భుతంగా ప్రదర్శించి అందరి మన్ననలు పొందింది. అలాగే ఈ అమ్మాయితో పాటు 8వ తరగతి విద్యార్థులు కావ్య, మహాలక్ష్మి, కీర్తన, అదేవిధంగా ఏడవ తరగతి విద్యార్థిని రాధా శ్రీ జనని భరతనాట్యం ప్రదర్శించి మెప్పు పొందింది. వీరంతా కర్నూలు బాలోత్సవంలో పాల్గొని పాఠశాల తరఫున సాంస్కృతి ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొంది పాఠశాలకు మంచి పేరు, ప్రఖ్యాతులు ఇనుమడింప చేసిన విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాటన్ శ్రీదేవి ఈ సందర్భంగా అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించిన టీచర్లు సరిత, సుశ్రీ లను కూడా ప్రధానోపాధ్యాయురాలు కాటం శ్రీదేవి అభినందించారు.వారికి షీల్డ్ , సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

About Author