ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పనిచేయాలి:ఎమ్మెల్యే
1 min read

అధికంగా రెవెన్యూ సమస్యలే
అధికారుల సమయపాలన లేదు
గ్రామాల్లో పార్టీని పటిష్టం చేయాలి
అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అధికారులు పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా ఎమ్మెల్యే ప్రజల నుండి అర్జీలను తీసుకుంటూ వాటికి సంబంధించిన అధికారిని పిలిచి సమస్యలను ఎందుకు పరిష్కరించడం అధికారులను ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ముందుగా అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కచ్చితంగా భూ సమస్యలు వస్తున్నాయని సమస్యలు పెండింగులో లేకుండా చూడాలని తహశీల్దార్ ను ఆదేశించారు. కొందరు అధికారులు సహకరించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని సచివాలయాల సిబ్బంది సమయపాలన అసలే పాటించడం లేదని వీటిపై మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందన్నారు. 49 బన్నూరులో నూతన సచివాలయానికి ప్రభుత్వ స్థలం చూడాలని పది రోజుల్లో మంజూరు చేస్తానని అంతేకాకుండా గతంలో మంజూరైన సచివాలయాలు మరియు ప్రభుత్వ భవనాలు గ్రామాల వారీగా ఆగిపోయిన వివరాలు ఇవ్వాలని వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేస్తారా లేదా లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు.
సమస్య పూర్తి అయితేనే సంతకం పెట్టండి
మీ సమస్య పూర్తి అయిన తర్వాతనే అధికారుల దగ్గర సంతకం పెట్టాలని లేకపోతే సంతకం పెట్టవద్దని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.చౌటుకూరులో గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు ఆన్ లైన్ లో వస్తుందని అలా చేయడానికి వీలు లేదని అధికారులు,నాయకులు సమన్వయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
గ్రామాల్లో పార్టీని పటిష్టం చేయాలి
రానున్న స్థానిక ఎన్నికల్లోపు
గ్రామాల్లో పార్టీని పటిష్ట పరచాలని ఎమ్మెల్యే కార్యకర్తల సమావేశంలో సూచించారు.గ్రామాల్లో ఏమేమి జరుగుతుంది ప్రభుత్వ పథకాలు ఎవరెవరికి అందడం లేదనేది బూత్ కన్వీనర్లు,కో కన్వీనర్లు, నాయకులు తెలుసుకోవాలి.కష్టపడితేనే పార్టీలో గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు.గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి నాయకులు ఎమ్మెల్యేకు వివరించారు.

