దత్తాత్రేయ స్వామి మూల విగ్రహమునకు ప్రాతః కాలంలో అభిషేకము అర్చనలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రధాన అనఘాష్టమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి మూల విగ్రహమునకు ప్రాతః కాలంలో అభిషేకము అర్చనలు జరిగినవి. ఈరోజు దేవాలయంలో సామూహిక అనఘాష్టమి వ్రతములు అత్యంత వైభవంగా జరపబడినవి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతములను ఆచరించి అనఘాదేవి సమేత అనఘాస్వామి వార్ల కృపకు పాత్రులైనారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదములు స్వీకరించినారు. మరియూ అన్న ప్రసాదవితరణ జరిగినది. ఈ అన్న ప్రసాద వితరణకు డా. యూ ప్రేమ్ కుమార్ శ్రీదేవి ల దంపతులు మరియూ డా. సీఏ నగేష్ వర్మ రాజేశ్వరి ల దంపతులు తమ వంతు సహకారం అందించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు మాతృ మండల సభ్యులు సంయుక్తంగా కార్యక్రమమును జయప్రదముగా జరిపించినారు.

