ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం
1 min read

సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు
వాసవీ మాత ఆత్మార్పణ రోజును మా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది
పెనుగొండ పేరు వాసవీ పెనుగొండ గా మార్పుచేసి సీఎం మరోసారి వైశ్యులపై ప్రేమను చాటారు
ఆర్యవైశ్యుల కోసం సీఎం చంద్రబాబు ఎంతో చేస్తున్నారు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల తరుపున సీఎంకు కృతజ్ఞతలు
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు చేసిందని ఆయన పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్యవైశ్యులు ఎన్నోఏళ్ల నుండి కోరుకుంటున్నవిధంగా పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మార్పుచేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు పెనుగొండకు విచ్చేసిన సందర్భంగా పేరు మార్పు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు టీజీ భరత్ తెలిపారు. వాసవీ పెనుగొండగా పేరు మార్చడం ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గౌరవం ఇవ్వడమేనన్నారు. ఆర్యవైశ్యులందరి తరుపున సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్నతలు తెలుపుతున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇక తమ ప్రభుత్వం వచ్చాక వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు సముచిత గౌరవం ఇచ్చారన్నారు. ఏపీలో ఆర్యవైశ్యుడినైన తనకు మంత్రిపదవి ఇచ్చారన్నారు. పక్కనున్న రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్యవైశ్యులకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదన్నారు. వైశ్యుల కోసం ఇంత చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఆర్యవైశ్యులు ఎప్పటికీ అండగా ఉంటారన్నారు.

