NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం

1 min read

కర్నూలు,  న్యూస్ నేడు:          జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి. కబర్థి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కార్యదర్శి, బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం 12-12-2025న కర్నూలు,           కొత్తపేట నందు గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు  సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో జడ్జిగారు మాట్లాడుతూ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా ఆర్థికంగా నిరుపేదలైన వారు ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్లో ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే ఉచిత ఆరోగ్య చికిత్సలను పొందగలరని తెలిపారు. ఈ పథకం  లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలు నగదురహితంగా అందిస్తుంది అని తెలిపారు.డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం మాట్లాడుతూ  ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీం ప్రభుత్వ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారు హెల్త్ కేర్ పొందడానికి అర్హత కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ యోజన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్ 14555 లేదా 1800111565 ఫోన్ చేసి తెలుసుకోవచ్చ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీవాణి వారి సిబ్బంది ఆశ వర్కర్లు మరియు కొత్తపేట కాలనీవాసులు పాల్గొన్నారు.

About Author