ఆదోని జిల్లా అయితే వలసలు ఆగుతాయి
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు అంబేద్కర్ సర్కిల్ లో జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా కావాలని రెండవ రోజు కనక శ్రీ యూత్ మద్దూతూ తెలుపుతూ కనక శ్రీ యూత్ నాయకుడు యస్ కె గిరి మాట్లాడుతూ ఆలూరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ ఐదు నియోజకవర్గం లు కలిపి ఆదోని జిల్లా ఏర్పాట్లు చేయాలని కర్నూల్ పోవాలంటే ప్రతి సారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదోని జిల్లా అయితే అన్ని పరిశ్రమలు వలసలు ఆగుతాయి కలెక్టర్ వారి కార్యాలయం ఆసుపత్రి లు అన్ని వస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఆదోని జిల్లా గా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం లో ఆలూరు జేఏసీ నాయకులు యల్లప్ప రామాంజి భూపేష్ కనక శ్రీ యూత్ నాయకులు రాజు, మల్లికార్జున ,శేషప్ప, సిద్దప్ప, గర్జప్ప, మహేష్ ,రవి, బజారప్ప, నాయకులు పాల్గొన్నారు.


