NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న బాలసదనంలో శిశువులు దత్తత

1 min read

ఆశ్రయం పొందుతున్న పిల్లలను చట్టపరంగా దత్తత ఇస్తున్నాం

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో నిర్వహిస్తున్న బాలసదనం,శిశు గృహాల ద్వారా ఆశ్రయం పొందుతున్న  బాలలను చట్టపరంగా  దత్తత ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా శుక్రవారం బాలసదనం నందు ఆశ్రయం పొందుతున్న బేబీ భవాని అను ఏడు సంవత్సరాలు బాలికను తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యానంగం మరియు పద్మావతి దంపతులకు చట్టబద్ధమైన కేరింగ్స్ పోర్టల్ ద్వారా రిజర్వ్ చేసుకున్న దంపతులకు వారి దరఖాస్తు డాక్యుమెంట్స్ ను హోం స్టడీ రిపోర్టును ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటిని వెరిఫై చేసిన తరువాత వారికి ప్రి అడాప్షన్ పోస్టర్ కేర్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శిశు గృహ నందు ఆశ్రయం పొందుతున్న బేబీ మోక్షజ్ఞ అను ఎనిమిది నెలల పాపను చెన్నై తమిళనాడుకు చెందిన సెందిల్ బిఆర్ మరియు భానుప్రియ ఎస్ అను దంపతులు చట్టబద్ధమైన దత్తత కొరకు కేరింగ్స్ పోర్టల్ నందు 2022 సం.లో అప్లై చేసుకోగా వారికి ఈ బేబీ 2025 నవంబర్ నెలలో రిఫరల్ వెళ్లగా వారు  ఆన్లైన్ లో రిజర్వ్ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్స్ తో   జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రీ సెల్వీ  ముందు హాజరయ్యి వారి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకున్న తరువాత  కలెక్టర్  చేతుల మీదుగా బేబీని దత్తత తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి మరియు సస్ సంక్షేమ శాఖ సాధికారత అధికారి పి.శారద జిల్లా బాలల సంరక్షణ అధికారి  సి.హెచ్ సూర్యచక్ర వేణి,శిశు గృహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.

About Author