NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ    తరపున సంస్కృత అధ్యాయనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఈరోజు జి . పుల్లా రెడ్డి  కళాశాల తరపున కేశవ మెమోరియల్ పాఠశాల, బుధవారి పేటలో ప్రారంభం అయింది.  ఈ కార్యక్రమంలో అధ్యక్ష రూపంలో దండెబోయిన పార్వతీదేవి  (ఎం.ఏ ,ఎం.ఇ డి.,పి.హెచ్.డి,స్లెట్. తెలుగు ఉపన్యాసకురాలు)  తెలుగు భాషకి సంస్కృత భాషకి చాలా దగ్గర సంబంధం ఉందని అలాగే తెలుగు కావ్యాలలో  అనేక పదాలు సంస్కృతం లో ఉన్నాయని దానికి సంస్కృత భాషను నేర్చుకోవడం చాలా అవసరం అని తెలిపారు.  అలాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డా. శ్రీనివాస దేసికన్  IIITDM కలాశాల నందు అసిస్టెంట్  ప్రొఫెసర్ గారు సంస్కృతం చదవుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తెలిపారు. అలాగే మన సంస్కృతీ సంప్రదాయాల గురించి వచ్చే తరం వారికి కూడా తెలియపరచాలి అని చెప్పారు.మన ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చినటువంటి  ఆదినారాయణ ఎస్​ఆర్​ జూనియర్ కళాశాల నందు సంస్కృత శిక్షకులు సంస్కృతం యొక్క గొప్పదనాన్ని తెలియపరుస్తూ భగవద్గీత పుస్తకం చదవాలని అలానే మన నీతి శాస్త్రంలో  ఉన్నటు వంటి శ్లోకాలు చెప్పి వాటిలో దాగి ఉన్న మధురమైన అర్థాన్ని సంస్కృతంలో చక్కగా చెప్పారు… ఈ కార్యక్రమం నందు పెద్దలు, పిల్లలు, గృహిణులు, శిక్షకులు    ఆర్​ఎస్​ఎష్​   కార్యకర్తలు అలాగే తదితరులు పాల్గొనడం జరిగింది.ఈ సర్టిఫికెట్ కోర్స్ శిక్షణ ఇవ్వడానికి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ నుండి వచ్చిన కుమారి సంధ్య   డా.దండెబోయిన పార్వతీదేవిని, డా. కె. ఈ శ్రీనివాస దేసికన్కి,  అలాగే ఆదినారాయణ కి ధన్యవాద సమర్పణ తెలిపారు.

About Author