“ఆదోని జిల్లా ప్రజల గుండెచప్పుడు”: బుట్టా రేణుక
1 min read
ఆదోని , న్యూస్ నేడు: ఆదోని జిల్లా ఏర్పాటు ఆదోని డివిజన్ లోని కొంతమంది అధికారం అడ్డుపెట్టుకుని జిల్లాను ఏర్పాటు చేయకుండా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆదోని జిల్లాను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆదోని జిల్లా కోసం ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కూడలి లో విద్యార్థి వామపక్ష ప్రజా సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం.ఎమ్మిగనూరు,: విద్యార్థి, యువజన, వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్సార్ సర్కిల్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు (నాలుగో రోజు) ఆదోని ప్రాంత ప్రజల న్యాయ సాధన లక్ష్యంగా మారాయి. ఈ శాంతియుత పోరాటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్ట శివ నీలకంఠ , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కేఆర్ మురహరి రెడ్డి గారితో పార్టీ శ్రేణులు మద్దతు తెలియజేశారు.దీక్షలో కూర్చున్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి సత్యన్నా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బాలరాజు పట్టణ కార్యదర్శి బాబు రైతు కూలీ సంఘం నాయకులు ఎల్లప్ప జేఏసీ నాయకులు బతకన్నా సత్యనారాయణరెడ్డి ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు కృష్ణ రఘునాథ కాజా ఆఫ్రిది గార్లకు నిమ్మరసం అందజేస్తూ, ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య ఆకాంక్షల ప్రతీకంగా పేర్కొన్నారు.దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదోని ప్రాంత ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం విద్యార్థులు, యువజనులు, వామపక్ష నాయకులు ముందుండి పోరాట పథంలోకి రావడం గర్వకారణమని బుట్టా రేణుక అన్నారు. “ప్రాంత అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం, యువత భవిష్యత్తు కోసం ఆదోని జిల్లాగా ఏర్పడాలనే డిమాండ్ ప్రజల గుండె చప్పుడుగా మారింది. ఈ ఉద్యమం కేవలం విద్యార్థుల పోరాటం మాత్రమే కాదు, సమస్త ఆదోని ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం” అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ నేతలు ఆదోని జిల్లా ఏర్పాటు ఇష్టపడకపోవడంతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, ఎమ్మిగనూరు నియోజవర్గం కావాలని, పత్తికొండ నియోజవర్గం కావాలని చెబుతూ జిల్లా ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని బుట్టా రేణుక ఎత్తిచూపారు. రిలే దీక్షలకు సంఘీభావం తెలిపి విరామం ప్రకటించారు.విద్యార్థుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు వృథా కాకుండా, ఆదోని జిల్లా ఏర్పాటు తుదలక్ష్య సాధన వరకు పోరాటం కొనసాగుతుందని ఉద్యమకారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతియుత పోరాటాలకు సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి విరూపాక్షి రెడ్డి, నందవరం మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్, పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు మధుబాబు, జిల్లా మైనార్టీ విభాగ ఉపాధ్యక్షులు మహబూబ్ బేగ్, జిల్లా చేనేత అధ్యక్షులు శివప్రసాద్, ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బి బసిరెడ్డి, చేనేత నియోజవర్గ అధ్యక్షులు మీసాల బండ నీలకంఠ, 25వ వార్డు ఇంచార్జ్ గంగులపాడు శ్రీనివాస్ రెడ్డి, 15వ వార్డ్ ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్, పట్టణ కార్యదర్శి గురువ మా భాష, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి తిమ్మాపురం బోయ బజారి, నాయకులు రామకృష్ణ, ఉరుకుందు గౌడ్, వీరాంజనేయులు, ఇబ్రహీం, ఎమ్మిగనూరు మండల గోనెగండ్ల మండల, నందవరం మండల మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

