NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంధ్రరాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు  స్ఫూర్తిదాయకం

1 min read

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రతి సంవత్సరం డిసెంబరు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారికంగా ఆత్మర్పణ దినోత్సవంగా నిర్వహించు కుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, కెఆర్ఆర్ సి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీ దేవి, జిల్లా వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author