ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ నిరాహారా దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహాపురుషుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ. శ్రీనివాస రావు అన్నారు. సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో పి ఆర్ ఈఏ ఈ ప్రభాకర్ రెడ్డి, ఐకెపి జీవి కృష్ణమూర్తి, జిఎస్ డబ్ల్యూఎస్ అధికారి శివకుమార్ గౌడ్, విద్యాశాఖ అధికారులు వెంకటేశ్వర నాయక్, మహేశ్వర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యు ఏఈ మధుసూదన్ మరియు అంగన్వాడి సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.

