NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025

1 min read

విద్యుత్ సేవలను పునరుద్ధరించడానికి ఆ శాఖ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

విద్యుత్ అధికారులు,సిబ్బంది ప్రజలకు అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ సేవలను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది చేసే కృషి ఎంతో అభినందనీయమని, ప్రజలు సహజ ఇంధన వనరులైన సౌర విద్యుత్తును వినియోగించి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడంలో దోహదపడాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  సూచించారు.జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025లో భాగంగా ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు జరిగిన అవగాహన ర్యాలీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ ను ఆదా చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ అవగాహన ర్యాలీలో ఏలూరు జిల్లా ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్ రాజు, డీఈఈ అంబేద్కర్ సహా పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author