సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన
1 min read

సమాచార హక్కు చట్టం మీ హక్కు ,తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత
జిల్లా పంచాయతీ అధికారికె.అనురాధ
ర్యాలీ నిర్వహించిన కార్యాలయ సిబ్బంది,కార్యదర్శులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు అప్పిలేట్ అధికారి మరియు జిల్లా పంచాయితీ అధికారి కె.అనూరాధ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు సమాచార హక్కు చట్టం గురుంచి ప్రజలకు తెలియజేయండo, తెలుసుకోవడం తెలుసుకోవాలన్నారు.సమాచార హక్కు చట్టం మీ హక్కు,తెలియ చెప్పడం ప్రభుత్వం భాద్యత అనే నినాదం తో ఏలూరు జిల్లా పంచాయితీ కార్యాలయం నుండి సెయింట్ ఆన్స్ కాలేజ్ రోడ్ మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ప్రజలకు ఆర్టీఐ వారోత్సవాలు మీద మరియు ఆర్టీఐ మీద అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కార్యాలయ పౌర సమాచారం అధికారి జి.లీలా కృష్ణ కుమారి, కార్యాలయ సిబ్బంది తదితులు పాల్గొన్నారు.

