బిజినెస్ రెఫార్మర్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డు కు చంద్రబాబే అర్హుడు
1 min read

ఆనందాన్ని వ్యక్తం చేసిన శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్.
యనమలకుదురు, న్యూస్ నేడు : బిజినెస్ రెఫార్మర్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డు కు చంద్రబాబు నాయుడు అర్హుడని, చంద్రబాబుకు అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ కు అభినందనలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్. యనమలకుదురు పార్టీ కార్యాలయంలోడెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార అనుకూల విధానాలు అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కి “బిజినెస్ రెఫార్మర్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పని రాక్షసుడని, ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రము అభివృద్ధి చెందాలని, పెట్టుబడులు రావాలి అని, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే తపనతో పనిచేస్తాడు అన్నారు. చంద్రబాబు జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తిని,ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబు పాలన విధానాన్ని మెచ్చుకుంటారన్నారు. అటువంటి నాయకత్వంలో మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామి పాల్గొన్నారు.

