NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమాచార హక్కుచట్టం-2005 ఒక బ్రహ్మాస్త్రం సద్వినియోగం చేసుకోవాలి

1 min read

జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం సమాచార హక్కు చట్టానికి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అవగాహన ర్యాలీకి జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ అక్టోబరు 12వ తేదీ 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టానికి 20 సంవత్సరాలు పూర్తి అయ్యాయని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టం చారిత్రాత్మక చట్టంఅని,  ప్రజలందరికీ ప్రభుత్వం, వివిధ శాఖలు నుండి వారికి అవసరమైన సమాచారాన్ని పొందడానికి చట్టపరమైన హక్కు ఈ సమాచార హక్కుచట్టం కల్పించిందని అన్నారుప్రజలు వారి కనీస అవసరాలకు సంబంధించిన రక్షిత మంచినీరు, శానిటేషన్, డ్రైనేజీ, రేషన్ పంపిణీ, పెన్షన్లు, పౌర విధులు, తదితర సమాచారాన్ని పొందడానికి సమాచార హక్కు తోడ్పడుతుందని అన్నారు. ఈ చట్టం వల్ల ప్రజలు  ప్రభుత్వ పనులు, వివిధ శాఖలు పనితీరును, కావలసిన సమాచారాన్ని పొందవచ్చునని సూచించారు . ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి యన్.వి.నాంచారయ్య, సూపర్డెంట్లు, రెవెన్యూ వివిధ విభాగాలు ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

About Author