22 న అటల్ మోదీ సూపరి పాలన యాత్ర కార్యక్రమం
1 min read

ఎమ్మెల్యే చింతమనేని కి ఆహ్వాన
పత్రికను అందించిన జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్,బిజెపి నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ పథంలో పయనిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి వాళ్ల సొంత ఇంటికలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని జిల్లా బిజెపి అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ , బిజెపి నాయకులు కలిసి ఈనెల 22వ తేదీన ఏలూరు జిల్లాలో జరగనున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలని తెలుపుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు,ప్రజలు, అధికారులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలు పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

