NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిండు జీవితానికి.. రెండు చుక్కలు…

1 min read
  • పిల్లలకు పోలియో చుక్కలు  వేయించడంలో  నిర్లక్ష్యం వహించవద్దు- 
  • లయన్స్ జిల్లా గవర్నర్ అడ్వైజర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు, న్యూస్​ నేడు:  పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను  వేయించే కార్యక్రమంలో కల్లూరు చింతల ముని దేవస్థానం దగ్గర పోలియో  బూత్ లో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని  లయన్స్ జిల్లా గవర్నర్  అడ్వైజర్ జిల్లా న్యాయ సేవా అధికారిక సంస్థ   చిల్డ్రన్ లీగల్ సర్వీస్ యూనిట్   మెంబర్ ఇండియన్ నేషనల్ పోలియోప్లస్ కమిటీ అవార్డు గ్రహీత  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కార్మికుల కుటుంబాల పిల్లలకు  పోలియో చిక్కలు అందేలా పరిసర  ప్రాంతాల వాళ్ళు సమాచారాన్ని అందించాలన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలే రేపటి సమాజానికి పునాది అని తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా  పోలియో చుక్కలు వేయించడానికి పిల్లలను తీసుకురావాలన్నారు. పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన చిన్నారులకు అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పళ్ళు పంపిణీ చేశారు . కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు  లయన్ త్రినాథ్ కుమార్, లయన్ నాగ స్వామి నాయక్ ఆశా వర్కర్ డి. శారద, అంగన్వాడీ వర్కర్ బి.వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author