లెక్చరర్ డాక్టరేట్ ఎల్లన్నకు ఘన సత్కారం
1 min read

డిఐఈఓ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ మచ్చ కంటి ఎల్లన్నను కళాశాలలో ఘనంగా సత్కరించారు. మంగళవారం కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మరియు మిడుతూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఘనంగా సత్కరించారు.4.9.2025 న ‘గీతం విశ్వవిద్యాలయం’బెంగళూరు లో లెక్చరర్ ఎల్లన్నకు డాక్టరేట్ (పిహెచ్ డీ పట్టా) పొందారు.పట్టా పొంది నందుకు గాను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మొలకల చెరువు ప్రిన్సిపాల్ ప్రభాకర్,దీబగుంట్ల ప్రిన్సిపాల్ వి సీతారామరాజు,యుడీసీ రమణారెడ్డి ,తిరుమలేశ్వర రెడ్డి,కళాశాల అధ్యాపకులు వెంకటేశ్వర రెడ్డి,శివకుమార్, భవానీశ్వరి సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

