NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“కురువలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి….

1 min read

టీడీపీ యువ నేత మంజునాథ్ గౌడ్…

హోళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ యువ నేత మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ  కర్నూలు జిల్లాలో రాజకీయం ప్రభావితం చెయ్యగలగిన స్థాయిలో ఆరు లక్షల మంది కురువ కులస్తులు ఓటర్లుగా కలిగి ఉన్నామని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది మన కులస్తులు ఓటర్లుగా కలిగి ఉన్నామని అన్నారు .కానీ మా కురువ కులస్తులకి జిల్లాలో ఎటువంటి నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత కేటాయించలేదని (ఇవ్వలేదని), మొన్న కూటమి ప్రభుత్వం 25 జిల్లాలకు పార్లమెంట్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది, కానీ అందులో ఒక్కరి కూడా కురువ కులస్తులు లేదని, నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే కురువ కులస్తులకు “ఒక ఓటు వేసే యంత్రంలా” ఉపయోగించుకుంటున్నారు తప్ప ఒక మనిషిలా కూడా చూడటం లేదని మంజునాథ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.కురువలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే మమే ఆర్థికంగా, సామాజికంగా,రాజకీయంగా, అభివృద్ధి సాధించగలమని అన్నారు.  మన ఆలూరు తాలూకాలో ఒకటే 65,000 మంది కురువ కులస్తులు ఓటర్లుగా కలిగి ఉన్నామని దానిని “టీడీపీ అధిష్టానం దృష్టిలో పేట్టుకొని” రేపు జరగబోయే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో, కాని మరియు  ఎంపీటీసీ, , జెడ్పిటిసి,  ఎన్నికల్లో కురువలకు అత్యధికంగా ప్రాధాన్యత, స్థానాలను కేటాయించాలని టిడిపి అధిష్టానానికి మంజునాథ్ గౌడ్ డిమాండ్ చేశారు.

About Author