NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాస్వామ్యాన్ని మరింత భలోతం చేయడంలో మీడియా పాత్ర ముఖ్యమైనది

1 min read

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

ఆశ్రo హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ

పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్,ఫోటో వీడియో జర్నలిస్ట్ సోదరులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజాస్వామ్యాన్ని  మరింత బలోపేతం చేయడంలో మీడియా పాత్ర ప్రముఖమైనదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు.  స్థానిక ఆశ్రమ్ ఆసుపత్రిలో సోమవారం  ఏపియుడబ్ల్యూజె, ఆశ్రమ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో  ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏలూరు, దెందులూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆశ్రమ్ ఆసుపత్రి డైరెక్టర్  శ్రీమతి గోకరాజు రతీదేవి, వివిధ జర్నలిస్ట్  సంఘాల ప్రతినిధులు,  ప్రభృతులు పాల్గొని జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  మంత్రి పార్థసారధి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభమని,  సమాజంలో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి  వాటిని సరిచేసేందుకు   కృషి చేసే జర్నలిస్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ప్రత్యేక  స్థానం ఉందన్నారు. ఆసుపత్రి సీఈఓ కె. హనుమంతరావు మాట్లాడుతూ  ఆశ్రమ్ ఆసుపత్రి ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య పరీక్షలు  నిర్వహించి,తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నామన్నారు. జర్నలిస్ట్  సంఘ నాయకులు కె.మాణిక్యరావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ఆశ్రమ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రాధాన్యతను ఇచ్చి ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలలోని జర్నలిస్టులకు  హెల్త్ కార్డులు జారీ చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథికి ఆశ్రమ్ ఆసుపత్రి వర్గాలు దుశ్శాలువా, మెమెంటోతో సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి,ప్రముఖులు   రెడ్డి  తిరుపతిరావు, పూజారి నిరంజన్,  జర్నలిస్టుల సంఘాల నాయకులూ,ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author