కర్నూలు నుండి శాయి స్పోర్ట్స్ హాస్టల్ ను తరలిస్తే చూస్తూ ఊరుకోం
1 min read

హైకోర్టులో పిల్ వేసి స్టే తీసుకువస్తాం
కర్నూలు, న్యూస్ నేడు: క్రీడాకారుల నిరసనలో పాల్గొని సంఘీభావం ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి..కర్నూలు శాయి స్పోర్ట్స్ హాస్టల్ ను తిరుపతికి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు,కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కర్నూల్ స్టేడియం ఎదుట క్రీడాకారులు,క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు సంఘీభావం తెలిపి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరానికి తల మాణికంగా ఉన్న స్పోర్ట్స్ హాస్టల్ ను తిరుపతి నగరానికి తరలించడం సిగ్గుచేటు అన్నారు. కర్నూలు నగరంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ ను కాపాడుకోలేని నేతలు కర్నూలు నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా ఎలా తీర్చిదిద్దుతారో చెప్పాలని ప్రశ్నించారు. కర్నూలు నుండి మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త వక్ఫ్ ట్రిబ్యునల్ తరలించే ప్రయత్నం చేశారు. వాటిని కోర్టు ద్వారా అడ్డుకున్నాము, కర్నూలు అభివృద్ధికి స్థానిక నేతలు స్పందన కరువైందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా క్రీడాకారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన హితోవు పలికారు.చిన్న చిన్న మరమ్మత్తులను కారణంగా చూపి స్పోర్ట్స్ హాస్టల్లో కుట్రతో తిరుపతికి తరలించేందుకు చూస్తే హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్రిడా సంఘాల జేఏసీ నాయకులు నాగర్నతమయ్య, శ్రీనివాసులు, నరేంద్ర ఆచారి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

