NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇనాం భూములను కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి

1 min read

ఏపి ఎమర్పియస్ జిల్లా నాయకులు గుండేపోగుల నేపాల్

మంత్రాలయం న్యూస్ నేడు :  మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో   సర్వే నంబర్  A 65 లక్ష్మమ్మ అవ్వ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి భూములను కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు  గుండు పోగుల నేపాల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  గ్రామ, మండల అధికారులు అక్రమ దారుల దగ్గర ముడుపులు తీసుకోని ఫేక్ మరణ ధ్రువీకరణ పత్రాలను మరియు  ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను పెట్టి అక్రమంగా ఇనాం భూములను కబ్జా కోరుల చేతుల్లో పెడుతున్నారాని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ముడుపులు ఇచ్చి అక్రమంగా పనులు చేసుకొని వారి అబ్బా సంపాదించినా సొమ్ము లాగా ఎగరేసుకు పోతున్నారని, ఇలాంటి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని  ప్రశ్నించారు. ఇలాంటి వారిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని , అలాగే ఇనాం భూములను కాపాడాలని లేకపోతే జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని  హెచ్చరించారు.

About Author