సమాజంపట్ల కర్తవ్యభావనే నిజమైన భక్తి
1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు , న్యూస్ నేడు: సమాజంలో శాంతి అహింసలు నెలకొనాలంటే దేశంలోని ప్రతి పౌరుడికి సమాజంపట్ల నిజమైన కర్తవ్య భావన కలిగి ఉండాలని, అదియే నిజమైన భక్తిఅని, దేశసేవ దేవతార్చనేనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో డోన్ మండలం, గోసాని పల్లె గ్రామంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజులుపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ తొగట సురేశ్ బాబు చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సి. బి. సూర్యనారాయణ, సర్పంచ్ ఎ.బాలమ్మ, మాధవస్వామి, సత్సంగ ప్రముఖ్ బండారు రామకృష్ణ, మాజీ సర్పంచ్ యం.శ్రీరాములు రామాంజనేయులు, కె.శ్రీనివాసులు, రంగయ్య, మధు, పుల్లమ్మ, యం. పార్వతమ్మ, లక్ష్మీదేవి, బి. సురేఖ, గంగన్నతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

