NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల జిల్లా కలెక్టర్ ని కలిసిన  మాజీ ఎమ్మెల్యే కాటసాని

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు:  ప్రజా ఫిర్యాదుల పరిష్కార  వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ని కలిసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజి ఎమ్మెల్యే  కాటసాని రాంభూపాల్ రెడ్డి  మరియు పార్టీ నాయకులు…!!!ఈరోజు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి  నంద్యాల లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ ని కలిసి నంద్యాల జిల్లా లో 14వేల ఎకరాలు ఉల్లి ని సాగు చేసిన 8వేల రైతులకు 26-12-2025 GO Rt No 1099 ఉత్తర్వులు వెంటనే అమలుచేయాలంటూ జిల్లా కలెక్టర్..కి వినతి పత్రాన్ని అందజేసిన నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బీజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, రైతు విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి , రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ…!!!రాష్ట్రంలో- 2025 ఖరీఫ్ లో ఉల్లి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 20 వేలు వేయటంలో నంద్యాల జిల్లా ఉల్లి రైతులను చేర్చక పోవడం బాధాకరం అని కాటసాని రాంభూపాల్ రెడ్డి  అన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు,నంద్యాల,కడప జిల్లాలో ప్రధానంగా సాగు చేశారు. అని వారు తెలిపారు. నంద్యాల జిల్లా రైతులకు కూటమి ప్రభుత్వం అధికారులు మొండిచెయ్యి చూపుతున్నారు అని అన్నారు.కావున రెండు రోజుల లోపు నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు నగదు జమ చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాం అని లేనియెడల రైతులతో కలిసి నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రైతు విభాగం నాయకులు,గడివేముల మరియు పాణ్యం మండల నాయకులు అనుబంధ విభాగాల జిల్లా మరియు నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

About Author