11వ రాష్ట్ర స్థాయి రగ్బీ సబ్ జూనియర్ పోటీలను ప్రారంభించిన డా. శంకర్ శర్మ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 11వ రాష్ట్ర స్థాయి రగ్బీ సబ్ జూనియర్ పోటీలను కర్నూలు కు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 15 జిల్లాల క్రీడాకారుల పాల్గొన్నారు. ఈపోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ జట్టు కు ఎంపిక చేయనున్నట్లు నిర్వహాకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో సైతం పాల్గొనాలని కోరారు. క్రీడల్లో రాణిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అందుకు భారత మహిళా క్రికెట్ జట్టు నిదర్శనం అన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే చదువుల్లో రాణించడంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం క్రీడా కోటలో వస్తుందని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్ కి దూరంగా ఉండి మంచి ఆహరం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్. శంకర్ శర్మ సూచించారు. ఈకార్యక్రమంలో క్రీడా ప్రతినిధులు రామాంజనేయులు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

