కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 200 కోట్ల నిధులతో 18 నెలలో అభివృద్ధి అందించగలం ఎమ్మెల్యే
1 min read

పెనమలూరు న్యూస్ నేడు : నియోజకవర్గం తెదేపా ఉత్తమ కార్యకర్తల అభినందన సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన బూత్ కన్వీనర్లలో సాంకేతికతతో స్పూర్తిగా నిలిచిన తెదేపా కుటుంబసభ్యులను రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమకార్యకర్త గా ఎంపికచేసి పంపగా, వారిని అభినందించి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ బూత్ కన్వీనర్లు అందరూ పట్టుదలగా పనిచేయడం వలనే పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ కూటమి అభ్యర్థి విజయం సాధ్యమైందని, ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపి, ఉత్తమ కార్యకర్తగా ఎంపికైన కార్యకర్తను స్పూర్తిగా తీసుకోవాలని, మరోసారి 304 మంది బూత్ కన్వీనర్లు ఉత్తమ కార్యకర్తలుగా ఎంపిక అయ్యేలా ఉండాలనీ సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్మాట్లాడుతూ,గత వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో పాటూ, అభివృద్ధి అనే ఊసు లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారని,కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గడిచిన 18 నెలల్లో 2014-19 సమయంలో అప్పటి తెదేపా ప్రభుత్వం ఆధ్వర్యంలో తొంబై శాతం అభివృద్ధి చేసిన సిద్ధార్ధ ఫ్లైఓవర్, యనమలకుదురు వంతెన, పూర్తి చేశామని, రాబోయే నూతన సంవత్సరంలో కుందేరు బ్రిడ్జి నిర్మాణం మొదలు పెడతామని, మద్దూరు ఉప్పులూరు రోడ్డుకు 8 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని, నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 70 కోట్లతో అంతర్గత రహదారులన్నీ, జిల్లా పరిషత్, ఆర్&బి రోడ్డుకు అనుసంధానం చేసి అభివృద్ధికి అనవాళ్లుగా పనిచేశానన్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ , 120 కోట్లతో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో విజయవాడకు అనుసంధానంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, పోరంకి పార్టీ కార్యాలయ వీధిలో బందరు కాల్వపై 45 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కొరకు టెండర్లు పిలుస్తున్నామని, పెనమలూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల సహకారంతో దాదాపు 200 కోట్ల అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మరియు అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిత గోపీచంద్ మరియు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ మరియు దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు సభ్యులు వెలగపూడి శంకర్ బాబు మరియు తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామి ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇన్చార్జిలు మండల పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు కార్యకర్తలు,తదితరులు, పాల్గొన్నారు.

