వృద్దాశ్రమంలో వృద్ధులకు డాక్టర్. శంకర్ శర్మ దుపట్లు, స్వీట్లు పంపిణీ
1 min read

పేదలకు తనవంతు సహయసహకారాలు ఎప్పుడు ఉంటాయని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు.
కర్నూలు, న్యూస్ నేడు: నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు సమీపంలోని జీ.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీ. వెంకటేష్ కాలనీలోని కృపా వృద్దాశ్రమంలో వృద్ధులకు డాక్టర్. శంకర్ శర్మ దుపట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. పేద వృద్దులకు తన వంతు సహయంగా దుప్పట్లు పంపిణీ చేశానన్నారు. వృద్దశ్రమం నిర్వహిస్తున్న అబ్రహం ను డాక్టర్. శంకర్ శర్మ ఈసందర్భంగా అభినందించారు. వృద్దాశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పేద వృద్దులకు ఎలాంటి సహాయం కావాలన్న తనవంతు సహయం చేస్తానని తెలిపారు. జనవరి నెలలో కృపా వృద్దాశ్రమానికి నిత్యావసర సరుకులు ఇస్తానని డాక్టర్. శంకర్ శర్మ హామీ ఇచ్చారు. వృద్దులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్లు పంపిణీ చేశారు.

