రాజముద్రతో కూడిన 94 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జనవరి 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు 141 గ్రామాల్లో నిర్వహించనున్న రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు పాత భూ హక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన 94 వేల 90 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కు ఇచ్చి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకోవాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో యజమాని పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, సామాజిక హోదా, ఫోటో తదితర వివరాలు అన్ని ఉంటాయన్నారు.. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత పొలం వివరాలు అని వస్తాయన్నారు.. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు… రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ రైతులను కోరారు.. యూరియా, పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడడం ద్వారా ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయని కలెక్టర్ తెలిపారు. మెగా డీఎస్సీ కింద టీచర్ల పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగిందన్నారు.తడకనపల్లెలో ఉన్న చెరువును నీటితో నింపి రైతులకు మేలు చేయడం జరిగిందన్నారు.. ప్రతి నియోజకవర్గంలో పశువుల వసతి గృహం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందచేశారు..అలాగే పొదుపు గ్రూప్ లకు స్త్రీ నిధి కింద మంజూరు అయిన రుణ పత్రాలను పొదుపు గ్రూప్ సభ్యులకు అందచేశారు.కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, సగర కార్పొరేషన్ డైరెక్టర్ రామ గిడ్డయ్య, తడకనపల్లె సర్పంచ్ సహేరాబీ, కల్లూరు మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.జుబేదాబీ, తదితరులు పాల్గొన్నారు.

