NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల తల్లిదండ్రులు తో సమావేశం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు  నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ సవేశాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. మన కళాశాల లో జరుగుతున్న విద్యా కార్యక్రమాల గురించి, విద్యార్థుల పురోగతి గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.మన కళాశాల లో విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యా సౌకర్యాలు, వాతావరణం కల్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అధ్యాపకులు, సిబ్బంది అందరూ విద్యార్థుల పురోగతి కోసం కృషి చేస్తున్నారు.తల్లిదండ్రులుగా మీ పాత్ర కూడా చాలా ముఖ్యం. మీరు పిల్లలతో మాట్లాడడం, వారి పురోగతిని తెలుసుకోవడం, వారికి సహాయం చేయడం చాలా అవసరం.మీ సహకారం, సలహాలు ఎప్పుడూ ఆశిస్తున్నాము. మనం కలిసి పనిచేస్తే, మన విద్యార్థుల భవిష్యత్తును మనం మెరుగుపరచగలమని అన్నారు. ఈ సమావేశం లో విద్యార్థుల పురోగతి పైన, వారి భవిష్యత్ ప్రణాళికల గురుంచి చర్చించారు.ఈ కార్యక్రమంలో   అధ్యాపకులు రామకృష్ణయ్య, మురళి మోహన్, ఓబులేసు, నవీన పాటి, మద్దిలేటి, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, శంకరయ్య మరియు విద్యార్థుల ,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author